చైనా నుంచి భారత్‌కు విమాన సర్వీసులు..ఐదేళ్ల తర్వాత రీస్టార్ట్ వీడియో

భారత్​, చైనా మధ్య ఐదేళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్న చైనా కాన్సుల్ జనరల్ జు వీ తెలిపారు. ఈ విషయంపై భారత అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. కొవిడ్, గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు జనరల్ అన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.