బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ముగిసిపోయింది. ఉల్టాపుల్టా పేరుతో వచ్చిన ఈ సెలబ్రిటీ గేమ్‌లో ఆడియెన్స్‌ను బాగానే ఎంటర్‌టైన్ చేసింది. అదే సమయంలో బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి.గ్రాండ్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో ఎదుట కొందరు ఆకతాయిల అల్లర్లు చేయడం, బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసులు నమోదు కావడం, అరెస్ట్ కావడం, ఆ తర్వాత బెయిల్ రావడం.. ఇలా ముగిసిన తర్వాత కూడా బిగ్ బాస్ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ పేరుతో మరొక చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనను బిగ్ బాస్‌లోకి పంపిస్తామంటూ కొందరు డబ్బులు తీసుకున్నారని మోసం చేశారంటూ యాంకర్ స్వప్న చౌదరి రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.