భారం అనుకున్నారో.. బంధం తెంచుకోవాలనుకున్నారో.. తెలియదుగానీ వారం రోజుల పసికందును ఆ జంట వద్దనుకున్నారు. కన్న వారే నిర్ధిక్షిణ్యంగా ఆ బిడ్డను చంపాలనుకున్నారు. ఓ ఎత్తైన వంతెనపై నిలబడి బిడ్డను అమాంతం కిందకు విసిరేశారు. అయితే బిడ్డ నేరుగా కిందపడిపోకుండా ఓ చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. చెట్టుపై నుంచి బిడ్డ ఏడుపు విన్న స్థానికులు తీవ్ర గాయాలపాలైన శిశువును కాపాడారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది