సొరంగం కార్మికులతో ఫోన్ లో సంభాషించిన ప్రధాని మోదీ - Tv9

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్‌క్యారా టన్నల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటకొచ్చిన విషయం తెలిసిందే. 17 రోజులుగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ప్రధాని మోదీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులంతా క్షేమంగా బయటకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని సొరంగంలో వారు ధైర్యంతో ఉండటాన్ని ప్రశంసించారు. 17 రోజులు అంటే తక్కువ సమయం కాదు..శ్రామికులు చూపిన ధైర్యం సాహసోపేతమైందని పొగిడారు.