జాతర సీక్వెన్స్‌కి ఫ్యాన్స్ రియాక్షన్ చూసి బన్నీ ఎమోషనల్ Sateesh

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ద‌ర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందిన‌ 'పుష్ప2: ది రూల్' ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేసింది. బుధ‌వారం రాత్రి 9.30 గంట‌ల బెనిఫిట్ షోతో పాటు తరువాత.. మార్నింగ్ షోలు కూడా ప‌డిపోయాయి. దీంతో థియేటర్ల వ‌ద్ద బ‌న్నీ ఫ్యాన్స్ కోలాహ‌లం నెల‌కొంది. కాగా, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేట‌ర్‌లో ఫ్యామిలీ, అభిమానుల‌తో క‌లిసి అల్లు అర్జున్ బుధవారం రాత్రి ఈ సినిమాను వీక్షించారు.