ఢిల్లీలో పొగ మంచు వీడడంలేదు. గురువారం ఉదయం ఇక్కడ విజిబిలిటీ సున్నా మీటర్లకు పడిపోయింది. దాదాపు 134 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి . ఢిల్లీనుంచి రాకపోకలు సాగించే పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు రైళ్ల రాకపోకలపై కూడా వాతావరణం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ సహా 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పాలం విమానాశ్రయంలో 25 మీటర్లు, సఫ్దార్‌గంజ్‌లో 50 మీటర్ల దూరం మాత్రమే కనిపిస్తోంది.