దేశ రాజధాని వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. నవంబర్ ప్రారంభం నుంచి రోజు రోజుకు పరిస్థితి దిగజారుతున్నది. రాబోయే దీపావళి పండగకు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వాయు కాలుష్యం పెరుగుతుండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలామంది శ్వాసకోశ, దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో మరిన్ని సమస్యలను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.