కరోనా మొదలైనప్పట్నుంచి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. దాదాపు రెండేళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన కరోనా తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ విజృంభించడం మొదలు పెట్టింది. మనదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. క్రియాశీల రోగుల సంఖ్య 2997కి పెరిగింది. గత వారం నుండి ప్రతిరోజూ యాక్టివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొత్త సబ్-వేరియంట్ JN.1 దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ కోవిడ్ వ్యాప్తి గురించి ఆందోళన పెరిగింది. ప్రభుత్వ నిపుణులు, మైక్రోబయాలజీ విభాగం బృందం, జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న ల్యాబ్స్ ఈ వేరియంట్‌పై పని చేస్తున్నాయి. JN. 1 ఈ వేరియంట్ వలన తీవ్రమైన ముప్పు ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.