ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. ఇంధనం మండి.. విమానంలో వ్యాపించిన మంటలు

దక్షిణ కొరియాలో తాజాగా ఘోర విమాన ప్రమాదం జరిగింది. థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్‌ ఫ్లైట్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం ల్యాండ్‌ అవుతూ అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.