టాలీవుడ్ హీరో నితిన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 8న అడియన్స్ ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో ఓ రేంజ్ అంచనాలను పెంచేసిన ఈ సినిమా.. రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ యూట్యూబ్‌లో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనుకున్నారంతా. కానీ అస్సలు ఊహించని స్థాయిలో ప్రేక్షకులను నిరాశ పరిచింది. కానీ అనూహ్యంగా ఓటీటీ ఫీల్డ్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా..