Nepal Earthquake వరుస భూకంపాలతో అల్లాడుతున్న నేపాల్ .. మళ్లీ ప్రకంపనలు - Tv9

భూకంపాలు నేపాల్‌ను వదలడంలేదు. రెండు రోజుల క్రితం నేపాల్‌ రాజధాని ఖాట్మండులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు ఆస్తి, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా అక్కడ మరోసారి భూమి కంపించింది. అక్టోబరు 24 తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.