సాయిపల్లవి.. పుట్టి పెరిగింది తమిళనాడే అయినా ప్రతీఒక్కరు తమ ఇంటిలోని అమ్మాయే అనుకునేంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. టాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా 'రామాయణ'తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈనేపథ్యంలోనే బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారామె. తరచూ లైమ్‌లైట్‌లో నిలవడం కోసం అక్కడి నటీనటులు పీఆర్ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారని చెప్పారు.