ఏపీ, తమిళనాడులను భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఏపీలో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మైచౌంగ్‌గా నామకరణం చేసిన ఈ తుఫాను డిసెంబర్ 4 లేదా 5వ తేదీన ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని పేర్కొంది. అయితే, ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ప్రస్తుతం చెప్పలేమని వాతావరణ శాఖ పేర్కొంది.