పుష్ప.. టాలీవుడ్ గేమ్ ఛేంజరా..

ఏ రంగంలో అయినా ఓ గేమ్ ఛేంజర్ ఉంటుంది. అంటే అంతవరకు మూస పద్దతిలో వెళ్లే దానిని పక్కకునెట్టి కొత్తదారిని చూపిస్తుంది. టాలీవుడ్ కు పుష్పా అలాంటిదేనా? ఎందుకంటే రికార్డుల రారాజుగా మారిన పుష్పరాజ్.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ కొత్త మార్గాన్ని సెట్ చేశారా? మార్కెట్ ను పెంచుకోవడానికి పుష్ప టీమ్ అనుసరించిన స్ట్రాటజీ.. ఇప్పుడు రాబోయే సినిమాలకు బాగా ఉపయోగపడుతుందా?