మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు టీఎస్‌ఆర్టీసీ కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. అందుకే తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరారు.