రెండు గ్రామాల మధ్య చిచ్చురేపిన దున్నపోతు.. ఏం జరిగిందంటే

రెండు ఊర్ల మధ్య దున్నపోతు పంచాయితీ తీరని చిక్కుముడిగా మారింది. జాతర విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ ఈ సంఘటన అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. కూడేరు మండలం ముద్దలాపురం, కడరకుంట గ్రామాల మధ్య దున్నపోతు వివాదం పెద్ద చిచ్చు రేపింది.