కొన్ని గంటల్లో 2024 సంవత్సరం ముగుస్తుంది. వెళ్తూ వెళ్తూ 2024వ సంవత్సరం ప్రజలకు ఓ అద్భుతమైన అనుభూతిని మిగిల్చి వెళ్లబోతోంది. డిసెంబర్ 30వ తేదీ రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించనుంది. అవును, అంతరిక్ష ప్రపంచంలో అపూర్వమైన ఖగోళ ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రతీ సంవత్సరం ప్రజలు నీలి చంద్రుడు, పౌర్ణమి, సూపర్ మూన్, సూర్యగ్రహణం, ఉల్కలు, రంగురంగుల వెలుతురు, గ్రహాలు మొదలైన వాటిని చూశారు.