చైనా, టిబెట్ లో పండే యాపిల్ కి యమా డిమాండు! What Is Black Diamond Apple And Is It Healthy - Tv9

సాధారణంగా యాపిల్స్ ఎరుపు రంగులో ఉంటాయి. పచ్చని రంగులో ఉన్న యాపిల్స్‌నూ మనం చూస్తుంటాం. కానీ, బ్లాక్‌ యాపిల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? నిజమేనండీ ..ఆ రకమైన యాపిల్‌ పండ్లు కూడా ఉన్నాయి. కానీ, వీటి ధర ఎక్కువ. ఒక్కో పండు రూ.500 వరకు ఉంటుంది. యాపిల్‌ జాతుల్లోనే ఈ పండుకు ప్రత్యేకత ఉంది. కేవలం చైనా, టిబెట్‌లోని న్యింగ్‌చీ పర్వత సానువుల్లో మాత్రమే ఇది పండుతుంది.