దక్షిణ థాయ్ లాండ్ ను ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబరు 27న దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబరు 29 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.