విభిన్న రకాల మొక్కలతో హైదరాబాద్ శివారులో ఏర్పాటైన నర్సరీ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రగతి ఎగ్జోటిక పేరుతో సమతా మూర్తి అవరణలో అతి పెద్ద నర్సరీని రూపొందించారు కర్ణాటక ప్రాంతానికి చెందిన కుమార స్వామి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల వద్ద ఈ నర్సరీ ఏర్పాటు చేశారు. నర్సిరీలోని మొక్కలను చూసేందుకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.