అంబానీ ఇంట పెళ్ళికి దేశవిదేశాలనుంచి అతిధులు వచ్చారు. ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రెటీల నుంచి హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ పెళ్ళివేడుకకు హాజరయ్యారు. అలాగే అమెరికన్ పాప్ సింగర్స్ కూడా హాజరయ్యారు. అదేవిధంగా అమెరికన్ నటి కిమ్ కర్దాషియాన్ కూడా ఈవేడుక కోసం ఇండియాకు వచ్చింది. తాజాగా ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కిమ్ కర్దాషియాన్.. తన ఫొటోలు, వీడియోలను తెగ షేర్ చేస్తూ ఉంటుంది.