పండగ చూపించేసిన కింగ్..అదిరిపోయిన 'నా సామిరంగ' ట్రైలర్ Naa Saami Ranga Trailer Review Nagarjuna

ఈసారి పండక్కి నా సామిరంగ అంటూ వచ్చేస్తున్నాడు టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున. ఘోస్ట్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న కింగ్.. ఇప్పుడు సంక్రాంతికి మాస్ జాతర అంటూ రాబోతున్నాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇదివరకు రిలీజ్ అయిన సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కాసేపటి క్రితం ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.