దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన సంఘటన సంతోషాన్నిచ్చింది. ఉత్తరాఖండ్ సిల్ క్యారా టెనల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. 17 రోజులపాటు నిరంతరంగా జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది.