ఆ ఇద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మండిపాటు

ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ కుట్రలో భాగంగానే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నేత కార్మికులకు మద్ధతుగా మాట్లాడినందుకు కేసీఆర్‌పై నిషేధం విధించారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై నిషేధం విధించిన ఈసీకి... మోదీ, రేవంత్‌ విద్వేషపూరిత ప్రసంగాలు కనిపించ లేదా? వినిపించ లేదా అంటూ ప్రశ్నించారు.