ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో కూలిన సొరంగం కింద చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ప్రక్రియ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. వారు సురక్షితంగా బయటకు రావడానికి ఇంకా కొన్ని రోజులు, వారాలు కూడా పట్టే అవకాశం కనిపిస్తోంది. నవంబరు 12వ తేదీన ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సహాయక చర్యల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి.