తమిళనాడులో వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉన్నన్ని భారీ నిర్మాణాలతో కూడిన ఆలయాలు మరెక్కడా లేవు. వాటిలో వెల్లూరులో ఉన్న జలకండేశ్వర ఆలయం ఒకటి. ఇపుడు ఈ ఆలయం కేంద్రంగా ఓ వివాదం నెలకొంది. క్రీ.శ 1550 లో విజయ నగర రాజుల పాలన సమయంలో ఇక్కడ స్వయంబు గా చెప్పబడే శివలింగం ఉండేది. ఆ సమయంలో అక్కడ ఆలయాన్ని నిర్మించారు. శివలింగం ఉన్న ప్రాంతం నీటితో నిండి ఉండడంతో ఈ ఆలయం జలకండేశ్వర ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఆతర్వాత ఆలయం పురావస్తు శాఖ అధికారులు ఆధీనంలోకి వెళ్ళిపోయింది.