శ్రీసత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం మండలంలో ఓ పెద్ద కొండచిలువ హల్‌చల్ చేసింది. గూనిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోకి 18 అడుగుల కొండచిలువ ప్రవేశించింది. ఒక్కసారిగా అంత పెద్ద కొండచిలువను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. జనం ఇంతగా గోలచేస్తూ పరుగులు తీస్తున్నా ఆ కొండచిలువ మాత్రం అక్కడినుంచి కదలడం లేదు. ఎటూ పారిపోవడంలేదు.