పేరు చివరన అనేక డిగ్రీలున్నా, ఉన్నత చదువులు పూర్తిచేసినా.. ఢిల్లీలో ఓ పంజాబీ వ్యక్తి వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 39 ఏళ్ల సందీప్ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్‌డీ అందుకున్నారు. సరైన ఉద్యోగం దొరక్క ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌గా కన్నా.. కూరగాయలు అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తున్నానని అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల మీడియాలో వైరల్‌గా మారాయి. తన కూరగాయల బండికి ‘పీహెచ్‌డీ సబ్జీవాలా’ అనే బోర్డ్ కూడా తగిలించాడు.