Viral ఇల్లెక్కి గుడ్డుపెట్టిన కోడి..! నేరుగా పెనంలోకే.. - Tv9

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా పంచుతుంటాయి. కొన్ని వీడియోలు ఎంతగానో నవ్విస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ కోడి ఇంటిపైకి ఎక్కి గుడ్డు పెట్టింది. అది నేరుగా వెళ్లి పొయ్యిమీద ఉన్న పెనంలో పడి ఆమ్లెట్‌ అయిపోయింది... ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.