విశాఖపట్టణంలోని పర్యాటక ప్రాంతాల్లోఇందిరా గాంధీ జూ పార్క్ ఒకటి. ఎన్నో రకాల జంతువులతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ జూ పార్క్ లో సోమవారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు పై ఎలుగుబంటి దాడి చేసింది. సోమవారం ఉదయం జూ పార్క్ లో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ పరిసరాల్లో నగేష్ క్లీన్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది.