ఈ దొంగకి ఎక్స్ పీరియన్స్ ఉన్నట్టు లేదు..! -Tv9

కొత్త ఏడాది బ్యాంకుకు కన్నం వేసైనా లైఫ్‌లో సెటిల్‌ అయిపోవాలనుకున్నట్టున్నాడు ఓ దొంగ... అనుకున్నదే తడవుగా బ్యాంకులో చోరీకి వెళ్లాడు. విజయవంతంగా బ్యాంకులోపలికి ప్రవేశించాడు. ఇక తన పంట పండినట్టే అనుకునేలోపు.. బ్యాంకులో అలారం మోగింది. గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పాపం దొంగ లోపలే చిక్కుకుపోయాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చుట్టుముట్టడంతో తప్పించుకునే పరిస్థితి లేక పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా దుబ్బాకలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో చోటుచేసుకుంది.