ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.. యశ్ కాన్వాయ్ ని ఢీకొని మరొక ఫ్యాన్ మృతి - Tv9

కన్నడ స్టార్ హీరో యష్ పుట్టిన రోజున తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురయి కన్ను మూశారు. మరో ముగ్గురు అభిమానులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. దీంతో హుటాహుటిన ఫారెన్ నుంచి వచ్చిన యశ్‌.. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఈ క్రమంలోనే యశ్‌ కాన్వాయ్‌ ఢీకొని మరో అభిమాని మరణించాడు.