Whatsapp Video 2023-12-31 At 12.39.16

ఆంధ్ర ఊటీలో అప్పుడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందడి మొదలైంది. అరకు లోయకు భారీగా సందర్శకుల రద్దీ పెరిగింది. ప్రకృతి ఒడిలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో.. నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలికేందుకు భారీగా చేరుకుంటున్నరు పర్యాటకులు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందడి చేస్తున్నారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో రూములన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. హోటల్ గదులు, క్యాంపింగ్ టెంట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టూరిజం గెస్ట్ హౌస్ లకు ఫుల్ ఆక్యుపెన్సీలో ఉన్నాయి. అరకు రోడ్లు, పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. విదేశీయులు కూడా అరకు చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.