ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. భార్య భారతితో కలిసి లండన్ వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. భార్య భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి అమెరికా వెళ్లారు. ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 16నే కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. ఈ నెల 25, లేదంటే 26న ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది.