వటపత్ర సాయి అలంకారంలో రాములోరి ఊరేగింపు - Tv9

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు శుక్రవారం ఉదయం వటపత్ర సాయి అలంకారంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడి ఊరేగింపు కనులపండువగా సాగింది. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు.