పిల్లికి.. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం. ఎస్.. మీరు వింటున్నది నిజమే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్లో కార్గొపార్సిల్ సర్వీస్ సెంటర్లో విధులు నిర్వహిస్తోంది. ఇప్పుడు పిల్లి డ్యూటీ చేస్తున్న వీడియో సోషల్ మీడియా తెగ హల్ చల్ చేస్తోంది. నిజానికి బస్టాండ్ లో ఉన్న కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలో వస్తువులను ఎలుకలు తరచు డ్యామేజ్ చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు అక్కడ ఉంటున్న ఇంచార్జీతో గొడవ పడటం సర్వ సాధారణంగా మారిపోయింది.