హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 లో పైపులకు భారీ లీకులు పడ్డాయి. కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీల ఏర్పడటంతో పెద్ద ఎత్తున వాటర్ వృధాగా పోతోంది. దీంతో ఈ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఈ నెల 11 న ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.