కార్తీక పౌర్ణమి శుభవేళ దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. వేలాదిగా భక్తులు సర్వేశ్వరుని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో జ్యోలిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అయింది. మల్లన్న స్వామివారి గర్భాలయ ఎదురుగా ఉన్న ఉమా రామలింగేశ్వరస్వామి మండంపలో నిత్యం భక్తులు తిరిగే ప్రదేశంలో నాగు పాము భక్తుల కంట పడింది.