'ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం'.. వల్లభనేని వంశీ

గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు పసుపు-కుంకమ పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగేళ్లుగా నడుస్తున్న స్కీమ్స్‌ నిలిపివేశారని వివరించారు. పేదలను బాధపెట్టడమే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు.