అక్కడ ఏం ముట్టుకున్నా కళ్లు పోతాయట..! - Tv9

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం లోని గుడేకల్ గ్రామంలో కొండపైన ఆంజయనేయ స్వామి వెలిశాడు. ఈ దేవాలయంలో వెలిసిన అంజన్నని గ్రామస్తులందరు నడవలయ్య స్వామిగా పిలుచుకుంటారు. నిత్యం దూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. ఆ కొండ పై అడుగు పెట్టాలన్నా ఎంతో పవితంగ్రా ఉండాలని స్థానికులు నమ్ముతారు. కొండపైకి వెళ్లినవారు స్వామి దర్శనం చేసుకొని రావాలి తప్ప అక్కడి, రాళ్లనుకానీ, చెట్లను కానీ కనీసం తాకడానికి కూడా సాహసించరు. వాటిని తాకినా, చెట్ల కొమ్మలను నరికినా, వారి కళ్లు పోతాయని స్థానికుల ప్రగాఢ నమ్మకం. పూర్వీకులనుంచే అక్కడ ఈ ఆచారం పాటిస్తున్నట్టు స్థానికులు చెబుతారు.