కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలు Delhi - Tv9

సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఢిల్లీ పోలీసులు ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్ చేశారు. హషీం ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. నిందితుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు మార్చి 11వ తేదీ రాత్రి 1.30 సమయంలో ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలేజీ సమీపానికి వెళ్లారు.