హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వదిలి వెళ్లిపోయిందని సమచారం. హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు షికార్లు సమయంలో నటాసా స్టాంకోవిచ్ తన లగేజ్‌బ్యాగ్ ను సర్దుకుని కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది. జులై 17 తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.