ఘోర అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్ లో ఎగసిపడిన అగ్నికీలలు - Tv9

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు మాల్‌లోని మిగతా అంతస్థులకు చేరాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. జేసీబీ సహాయంతో మాల్‌ షట్టర్లను తొలగించారు.