తెలంగాణలో తుది ఓటరు జాబితా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 26 లక్షల 18 వేల 205 మంది ఓటర్లు ఉన్నారు. 1 కోటి 62 లక్షల 98 వేల 418 మంది పురుష ఓటర్లు ఉన్నారు.. ఇక మహిళా ఓటర్ల విషయానికి వస్తే 1 కోటి 63 లక్షల 1 వెయ్యి 705 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2 వేల 676 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. ఓటర్లు నెల 30న జరిగే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.