విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో మమేకమవుతారు. వారితో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. తమకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పే టీచర్ తమను వదిలి వెళ్తుంటే ఆ చిన్ని హృదయాల బాధ కన్నీటి ధారగా మారింది. నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా ముద్దాడ బాలరాజు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు.