కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య! - Tv9

వివాహమైన తరువాత ఒకరికి ఒకరుగా కలిసిమెలసి జీవిస్తారు భార్యాభర్తలు. ఒకరికి ఏదైనా కష్టం వస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. ఛత్తీస్‌గఢ్‌లో భర్త కోసం భార్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే .. బతౌలీలోని భారత్ మాతా చౌక్ నివాసి, హార్డ్‌వేర్ దుకాణం నిర్వాహకుడు ఆయుష్‌ అగర్వాల్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో అతని భార్య తన కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను నిలబెట్టింది. ఈ కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత ఆయుష్‌ అగర్వాల్‌ కోలుకున్నారు.