ట్రెండింగ్ లో కమల్ హాసన్ , రజినీకాంత్ వీడియో Rajinikanth Kamal Haasan -@Tv9telugudigital

సౌత్‌ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్లలో టాప్‌లో ఉంటారు ఉలగనాయగన్‌ కమల్‌హాసన్ , సూపర్ స్టార్ రజినీకాంత్ ‌. ఈ ఇద్దరూ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తలైవా, కమల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారంటే ఆ క్రేజ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా అలాంటి దృశ్యమే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇలా ఒక్క చోట చేరేందుకు కారణమేమై ఉంటుందనుకుంటున్నారా..? ఈ ఇద్దరి సినిమాల షూటింగ్ ఒకే స్టూడియోలో జరుగుతోంది.