ఏది నిజం. ఏది అబద్ధం. Sunita Williams

రోజు రోజుకీ భయాలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల టూర్.. ఎప్పుడు తిరిగొస్తారో తెలియని స్థితికి చేరింది. దీంతో అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి రోజుకో కథనాలు వస్తున్నాయి. గతంలో యూఎస్ మిలటరీ స్పేస్‌లో పని చేసిన శాస్త్రవేత్తల మాటలు వింటూ ఉంటే.. అసలు సునీత - విల్ మోర్ ఇద్దరూ భూమికి తిరిగొచ్చే అవకాశం ఉందా లేదా.. వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి.