మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో

ఉరుకుల పరుగుల జీవితంలో ఇల్లు, ఉద్యోగ నిర్వహణలో తీరిక లేని సమయం గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒత్తిడితో అయితేనేమి.. మరో కారణంతో అయితేనేమి చాలామంది జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా.. మన అలవాట్లు, నిర్లక్ష్య వైఖరి మన మెమరీపై తీవ్ర ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనకు తెలియకుండానే వీటి ప్రభావం మనపై తీవ్రంగా ఉంటుందని, దీనిని ఏమాత్రం గుర్తించకుండా మనకు తెలియకుండానే వాటిని అనుసరిస్తూ ఉంటామని చెబుతున్నారు. మనం చేసే ఆ పొరపాట్లు, అలవాట్లను గుర్తించి, మార్చుకోవడం ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపర్చుకోవచ్చని సూచిస్తున్నారు.