రైల్ కోచ్‌ దిగువ భాగం నుంచి వెలువడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

దేశంలో మరో రైలుకు పెను ప్రమాదం తప్పింది. భువనేశ్వర్‌ – హౌరా జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి . అయితే, సకాలంలో స్పందించి వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.